సంచలన స్కెచ్ వేసిన ఏపీ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు..!

Written By Xappie Desk | Updated: January 13, 2019 15:12 IST
సంచలన స్కెచ్ వేసిన ఏపీ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు..!

తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే ఒక మీడియా చానల్లో వచ్చిన ఒక కథనం ప్రకారం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో ఎవరికి వారు పోటీ చేసి..నేషనల్ పాలిటిక్స్ లో మాత్రం బిజెపి పార్టీకి వ్యతిరేకంగా అంటూ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవనున్నట్లు ఆ మీడియాలో వచ్చిన కథనం. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సూచనప్రాయంగా ఈ విషయం చెప్పారు. రాహుల్ గాందీ కూడా ఇవే సంకేతాలు ఇచ్చారని ఆ కదనం చెబుతోంది. ఇంతవరకు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న భావన రెండు పార్టీలలో ఉంది. అయితే తెలంగాణలో ఘోరంగా ఓడిపోయిన నేపద్యంలో ప్రజల మనోభావాలకు తగిన విదంగా ఎపిలో కాంగ్రెస్ తో పొత్తుపై నిర్ణయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారని సమాచారం. రాష్ట్రాల్లో పొత్తు గురించే కాకుండా జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రస్తుతం చరిత్రాత్మక అవసరమనే అభిప్రాయానికి రాహుల్,చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా చెబుతున్నారు. విడి,విడిగా పోటీచేసి కాంగ్రెస్,టిడిపిలు ఎపిలో మాచ్ పిక్సింగ్ ద్వారా పోటీ చేస్తాయన్నమాట. ప్లాన్ బి అమలు చేయడానికి సిద్దం అవుతున్నారట.
Top