జనసేన కార్యకర్తలకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్..!

By Xappie Desk, January 13, 2019 15:14 IST

జనసేన కార్యకర్తలకు అదిరిపోయే షాక్ ఇచ్చిన పవన్..!

ఏపీలో ఎన్నికలు వస్తున్న క్రమంలో ఇటీవల పొత్తుల విషయంలో కేవలం వామపక్షాలతో తప్ప వేరే పార్టీలతో కలిసి పని చేసే ప్రసక్తి లేదని తేల్చేశారు జనసేన అధినేత పవన్. అయితే ఈ క్రమంలో ఇటీవల కడప జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి రాయబారాలు పంపుతున్నారని సిగ్గు ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క ఒంటరిగానే పోటీ చేస్తామని మాట్లాడుతూ మరోపక్క ఇటువంటి రాయబారాలు పంపడం దేనికి సంకేతం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ 2019 శాసనసభ ఎన్నికలలో అద్బుతాలు సాదిస్తామో,లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అయితే జనసేన బలంగా నిలబడుతుందని ఆయన అన్నారు. గత ఎన్నికలలో టిడిపికి మద్దతు ఇచ్చి ఒక సామాజిక ప్రయోగం చేశానని ఆయన అన్నారు. అది విజయవంతం అవడం వల్ల జనసేన జనంలోకి వెళ్లగలిగిందని ఆయన అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలన్నా, అమరావతి ముందుకు వెళ్లాలన్నా జనసేన పార్టీ అవసరం ఉందిని ఆయన అన్నారు. ఏది ఏమైనా రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ కీలక మవుతుందని అందరికీ స్పష్టం చేశారు పవన్.Top