ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ విజయమ్మ..?

By Xappie Desk, January 14, 2019 13:39 IST

ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ విజయమ్మ..?

2014 సంవత్సరంలో విశాఖ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన వైసిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు తాజాగా రాబోయే ఎన్నికల్లో పోటీ విషయమై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. జగన్ కోరితే రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రజలు రాష్ట్రం లో ఏం జరుగుతుందో ప్రతీది గమనిస్తున్నారని మార్పు కోసం ఎదురు చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా జగన్ చేసిన పాదయాత్ర సామాన్య ప్రజల్లో బలంగా వెళ్లిందని ప్రజలు జగన్ ని గట్టిగా నమ్ముతున్నారని..వచ్చేది వైసీపీ సర్కారేనని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఎపి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని విజయమ్మ అన్నారు. జగన్ పై దాడి విషయాన్ని అవహేళన చేయడం బాధ కలిగించిందని అన్నారు. ఎన్నికల్లో వైసిపి ఏకైక ఎజెండా ప్రత్యేక హోదా అని, ప్రత్యేక హోదా ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. మొత్తం మీద వైసిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా ధీమాగా ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


Tags :


Top