మంత్రి లోకేష్ కి కొత్త పేరు పెట్టిన వైసీపీ పార్టీ సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి..!

By Xappie Desk, January 14, 2019 13:44 IST

మంత్రి లోకేష్ కి కొత్త పేరు పెట్టిన వైసీపీ పార్టీ సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి..!

వైసిపి సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. పార్టీ తరఫున జరుగుతున్న కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తున్న అవినీతి వంటి విషయాలను సోషల్ మీడియాలో నెటీజన్లతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల తెలుగుదేశం పార్టీపై మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ పై ట్విట్టర్ లో తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ కామెంట్లు చేశారు. తాజాగా లోకేష్‌పై అదిర‌పోయే సెటైర్ వేశారు. తెలంగాణలో కేటీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి లోకేశ్‌కు నిద్రపట్టడం లేదు. తండ్రి అర్జంటుగా తప్పుకొని సీఎం కుర్చీని లేదా పార్టీ బాధ్యతలను తనకు అప్పగిస్తే బాగుండని కలలుకంటున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని తెలియదు పాపం చిట్టినాయుడికి.. అంటూ ఎద్దేవాచేశారు. ప్ర‌జ‌ల్లో టీడీపీపై పూర్తి వ్య‌తిరేక‌త ఉంద‌ని అందుకే తూర్పుగోదావరి జిల్లా కట్టమూరులో మంత్రి లోకేశ్‌ను మహిళలు తరిమికొట్టార‌న్నారు. వచ్చే మూడునెలలు పచ్చ పార్టీ నేతలకు ఇటువంటి పరాభవాలు తప్పవు....అంటూ వరుస ట్వీట్లతో ఏపీ రాజకీయాన్ని రసవత్తరం చేశారు.


Tags :


Top