ఏపీలో సొంతంగా ఇంటిలిజెంట్ సర్వే చేయించి ఫలితాన్ని చూసి షాక్ తిన్న మోడీ…!

Written By Xappie Desk | Updated: January 14, 2019 13:52 IST
ఏపీలో సొంతంగా ఇంటిలిజెంట్ సర్వే చేయించి ఫలితాన్ని చూసి షాక్ తిన్న మోడీ…!

తాజాగా ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వేయడంతో డిఫెన్స్ లో పడిపోయారు ఆ పార్టీకి చెందిన నేతలు. మరి కొద్ది నెలలలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో కచ్చితంగా రాబోయే ఎన్నికలలో కేంద్రంలో అధికారంలోకి ఉండాలంటే ప్రాంతీయ పార్టీల బలం అవసరం ఉంటుందని భావించిన ప్రధాని మోడీ..తాజాగా ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఓ సర్వే చేయించారు. తాజాగా ఏపీ లో జరుగుతున్న రాజకీయ ముఖచిత్రం గమనిస్తే రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇంటిలిజెన్స్ ద్వారా మోడీ తెలుసుకున్నారట. నిఘా వర్గాల ద్వారా మోడికి అందిన సమాచారం వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లియర్ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని కూడా తేలిందట. ఇక ఎన్డీఏ ప్ర‌భుత్వానికి ఈసారి పూర్తి మెజారిటీ రాద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌తు క‌శ్చితంగా అవ‌స‌రం. రాష్ట్రంలో మొత్తం 25 సీట్లు ఉంటే… వాటిలో 15- 20 సీట్లను గెలుచుకుంటుందంది నిఘా వర్గాల‌తో పాటు జాతీయ స‌ర్వేలు స్ప‌ష్టం చేశాయి. కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంద‌కు పూర్తి మెజారిటీ రాక‌పోతే జ‌గ‌న్‌ను ఏదొక విధంగా త‌న దారికి తెచ్చుకొనేందుకు మోదీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని ఎవ‌రు సంత‌కం చేస్తే వారికే త‌మ మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ అనేక సార్లు ప్ర‌క‌టించారు. మ‌రి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని జ‌గ‌న్‌తో దోస్తీ క‌డ‌తారా లేకా ఏదొక విధంగా త‌న దారికి తెచ్చుకుంటారో చూడాలి.Top