చంద్రబాబుకి ఇదే చిట్టచివరి ఎన్నికలు అంటున్న వైసీపీ పార్టీ నేత..!

Written By Xappie Desk | Updated: January 14, 2019 14:01 IST
చంద్రబాబుకి ఇదే చిట్టచివరి ఎన్నికలు అంటున్న వైసీపీ పార్టీ నేత..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అంతటా అలుముకుంది. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని గమనిస్తే త్రిముఖ పోటీ తో పాటు ఎక్కువగా తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే వైసిపి అధినేత జగన్ తన పాదయాత్ర తో తన ప్రత్యర్థి పార్టీల విషయంలో క్లారిటీ ఉంటూ రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని పక్కా ప్లానింగ్ తో ఉన్నారు జగన్. మరో పక్క టిడిపి అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తనను గెలిపించడం ఖాయమనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తే పింఛన్ 2000 చేస్తానని ప్రకటించారు. అయితే ఆ సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. రాష్ట్ర బడ్జెట్ తెలియకుండా జగన్ ఇష్టానుసార మైన హామీలు ప్రజలకు ఇస్తున్నారని కూడా కామెంట్లు చేశారు. అయితే తాజాగా చంద్రబాబు పింఛను రెండు వేల రూపాయలు చేయడం పట్ల వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి చంద్రబాబు పెంచినటువంటి పింఛను లెక్కలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తాజాగా ప్రకటించిన పింఛను లెక్కలు అన్ని కేవలం ఈ మూడు నెలల కోసమే అని,ఇదంతా బాబు యొక్క పొలిటికల్ గేమ్ అన్నట్టుగా మాట్లాడారు.అలాగే, జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాలు కాన్సెప్ట్ కి చంద్రబాబుకి మతి భ్రమించింది అని తెలిపారు. తెలంగాణాలో బాబు చేసిన పనికి అక్కడి ప్రజలు తమ ఓటుతో తరిమి కొట్టారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబుకి రాజకీయ సమాధి తప్పదని శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
Top