ఆంధ్రాలో రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరో తేల్చి చెప్పిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!

By Xappie Desk, January 14, 2019 15:18 IST

ఆంధ్రాలో రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరో తేల్చి చెప్పిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!

ఆంధ్రాలో రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరో తేల్చి చెప్పిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..!
 
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఒకపక్క ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో సర్వేలు నిర్వహిస్తుండగా మరోపక్క రాజకీయ నేతలు తమ తమ నియోజకవర్గాలలో ప్రభుత్వ కార్యక్రమాలలో మరియు పార్టీ కార్యకలాపాలలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఏపీ రాజకీయాలలో రాబోయే ఎన్నికలలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న విషయంపై సోషల్ మీడియా లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రాలో రాజకీయ పరిస్థితి గమనిస్తే జగన్, పవన్ మరియు చంద్రబాబుల మధ్య పోటీ నెలకొంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తాజాగా కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలు పాల్ సొంతం చేసుకోబోతున్నారంటూ ట్వీట్ పెట్టారు.ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ యేసు క్రీస్తు తర్వాత అంతటి గొప్ప వ్యక్తి పాలే అని అందుకే గెలవబోతున్నాడు అంటూ ట్వీట్ చేసారు. దీంతో రామ్గోపాల్వర్మ చేసిన కామెంట్లపై చాలా మంది నెటిజన్లు భలే వ్యక్తిని రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేశారని ఇద్దరూ కలిసి డిబేట్లో కూర్చుంటే ఇంకా బాగుంటుందని అంటున్నారు.Top