సీరియస్ అయిన మోడీ..!

Written By Xappie Desk | Updated: January 16, 2019 12:03 IST
సీరియస్ అయిన మోడీ..!

దేశంలో వివాదాస్పదంగా మారిన శబరిమలై వివాదంపై ప్రదానిమోడీ స్పందించారు. కేరళలోని వామపక్ష కూటమి, కాంగ్రెస్ ఆద్వర్యంలోని యుడిఎఫ్ లు ప్రజల మాటలను పట్టించుకోవడం లేదని అన్నారు. కేరళలో ఆయ రెండు కూటములు శాంతి బద్రతలను దెబ్బతీసే విదంగా వ్యవహరిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులకు భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్రలపై గౌరవం లేదన్నారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ ప్రవర్తన చరిత్రలో హేయంగా మిగిలిపోతుందని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీ కానీ ప్రవర్తించనంతటి అతి సిగ్గుమాలినతనంతో ఈ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటులో ఒకటి చెప్తుందని, పట్టణంతిట్టలో మరొకటి చెప్తుందని, శబరిమలపై ఆ పార్టీకి స్పష్టత లేదని, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని ఆరోపించారు. శబరిమల విషయంలో తాము ప్రజలతోనే ఉన్నామని, తమ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు.
Top