తెలుగు రాజకీయాల్లో సంచలనం జగన్ ని కలుస్తున్న కేటీఆర్..!

By Xappie Desk, January 16, 2019 12:08 IST

తెలుగు రాజకీయాల్లో సంచలనం జగన్ ని కలుస్తున్న కేటీఆర్..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ దేశంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని తెగ తాపత్రయపడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫెడరల్ ఫ్రంట్ పేరిట దేశంలో ఉన్న చాలామంది జాతీయ రాజకీయ నాయకులను కలిశారు. ఈ నేపథ్యంలో తాజాగా టిఆర్ఎస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న కెసిఆర్ కుమారుడు కెటిఆర్ వైసీపీ అధినేత జగన్ తో కలవడానికి రెడీ అయ్యారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ ప్రంట్ లో చేరే విషయమై ఆ పార్టీ అదినేత జగన్ తో చర్చలు జరపడానికి టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతున్నారు. టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్, కరీంనగర్ ఎమ్.పి వినోద్ కుమార్ ,విప్ పల్లా రాజేశ్వరరెడ్డి,మరో నేత శ్రావణకుమార్ రెడ్డిలు ఈ బృందంలో ఉంటారు. ఫెడరల్ ప్రంట్ లో చేరే విషయమై వారు చర్చలు జరుపుతారు. వీరిద్దరి భేటీ గురించి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఏపీలో ఎన్నికల ముందు కెసిఆర్ తనయుడు కేటీఆర్ జగన్ తో బేటి అవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.Top