పవన్ కళ్యాణ్ నన్ను ఫాలో అవుతున్నాడు అని అంటున్న చంద్రబాబు..?

Written By Xappie Desk | Updated: January 16, 2019 12:13 IST
పవన్ కళ్యాణ్ నన్ను ఫాలో అవుతున్నాడు అని అంటున్న చంద్రబాబు..?

ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మరియు వైసీపీ పార్టీ కలిసి కక్ష సాధింపు చర్యలు గా చంద్రబాబు పై వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని ఇలానే రాజకీయ వ్యవస్థ ముందుకు వెళితే సమాజానికి చెడు చేసిన వారమవుతామని అన్నారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోయాయి అని ప్రతిపక్ష పార్టీలు కామెంట్లు చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు పవన్ కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. తాను మాట్లాడిందే పవన్ కూడా మాట్లాడారని చంద్రబాబు సంబరంగా చెబుతున్నారు. కెసిఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని పవన్ అన్నారని తాము చెప్పినదానికి పవన్ కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు. ఏపీలో ఉంటూ, ఏపీలో రాజకీయ పార్టీ నడుపుతూ ఏపీలో వ్యవస్థపై నమ్మకం లేదంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, మోదీ, జగన్‌ ఏకమైనా జనం అభిప్రాయం మార్చలేరని, ఎపిలో తామే గెలుస్తామని ఆయన అన్నారు. ఎంతమంది కలిసిన టిడిపి గెలుపు ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.
Top