దేశంలో సంచలనం అయినా ర్యాలీ..!

Written By Xappie Desk | Updated: January 16, 2019 12:21 IST
దేశంలో సంచలనం అయినా ర్యాలీ..!

2014 ఎన్నికల్లో దేశమంతా మోడీ నామ జపంతో మారుమ్రోగిపోయింది. దీంతో ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో బిజెపి పార్టీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారన్న కామెంట్లు జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది నేతలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మహా కూటమి ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నా, వైరుద్యాల కారణంగా అవి ఒక కొలిక్కిరావడం లేదు. ఈ నెల 19 వ తేదీన కోల్ కొతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏర్పాటు చేయతలపెట్టిన ర్యాలీకి ముఖ్యమైన నేతలు ఎందరు వెళతారన్నది చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాందీ రాకపోవచ్చని కాంగ్రెస్ సంకేతాలు ఇచ్చింది. ప్రధానమంత్రిగా అభ్యర్థిగా రాహుల్ గాందీని మమత బెనర్జీని ఒప్పుకోనందున ఆయన ఆ ర్యాలీకి రాకపోవచ్చు. అయితే గులాం నబీ అజాద్ లేదా ఖర్గేని పంపవచ్చని భావిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ హాజరు కారాదని అంటున్నారు. కొద్ది కాలం క్రితం డిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి మాయావతి, అఖిలేష్ యాదవ్ లు గైర్ హాజర్ అయ్యారు. వారు కోల్ కొతా ర్యాలీకి వచ్చేది, రానిది తేల్చడం లేదు. ఎటు తిరిగి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ప్రదాని దేవెగౌడ రావడానికి ఒప్పుకున్నారు.
Top