షర్మిల చేసిన కామెంట్లపై సీరియస్ ఐన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: January 16, 2019 13:03 IST
షర్మిల చేసిన కామెంట్లపై సీరియస్ ఐన చంద్రబాబు..!

వైసీపీ అధినేత జగన్ చెల్లెలు షర్మిల ఇటీవల మీడియా ముందుకు వచ్చి తన పై తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ తనకి మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోకి లేనిపోని సంబంధాలు సృష్టిస్తున్నారు అంటూ 2014 నుండి ఈ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఎవరు వ్యక్తులపై హైదరాబాద్ పోలీస్ శాఖకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు షర్మిల. ఇదే మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులు ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా అని ప్రశ్న వేయగా ఏపీ పోలీస్ శాఖ పై తనకు నమ్మకం లేదని సంచలన కామెంట్ చేశారు షర్మిల.
దీంతో షర్మిల చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరు అలాంటి పనులు చెయ్యరని,తాను కూడా ఎప్పుడు మిగతా రాజకీయనాయకుల్లా వ్యక్తిగత జీవితాల జోలికి పోలేదని హితవు పలికారు. షర్మిల చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇంకా ఇలా వ్యక్తిగతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే మాట్లాడుతారని తాను మాత్రం ఎప్పుడు ఎవరి వ్యక్తిగత జీవితాల విషయం కోసం మాట్లాడలేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఏపీ పోలీసులపై షర్మిల చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు ఏపీ సీఎం చంద్రబాబు.
Top