ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న టిఆర్ఎస్ నేతలు..!

Written By Xappie Desk | Updated: January 16, 2019 13:15 IST
ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న టిఆర్ఎస్ నేతలు..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక వ్యూహాలు వేస్తూ మహాకూటమిని ఏర్పాటు చేసి తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికలలో క్రియాశీలకంగా వ్యవహరించి కెసిఆర్ కి అధికారం దక్కకుండా చేయాలని శతవిధాల ప్రయత్నాలు చేసిన చంద్రబాబు విఫలమయ్యారు. ఈ క్రమంలో గెలిచిన కేసీఆర్ త్వరలోనే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. అయితే త్వరలో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ చంద్రబాబుకిఎటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారోనని అందరూ రెండు తెలుగు రాష్ట్రాల కు చెందిన ప్రజలు మరియు రాజకీయ నేతలు ఉత్కంఠభరితంగా ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంక్రాంతి సంబరాలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీ అధ్యక్షుడు కే టి ఆర్ ఆంధ్ర రాష్ట్రంలో పండగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బెజవాడలో ఉన్న ఆలయాన్ని దర్శించుకుని మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు వారి రాష్ట్రానికి వచ్చి ఎంత మర్యాదగా వారి పార్టీకి ప్రచారం చేసుకొని, వారి పార్టీకి ఎలాంటి నష్టాన్ని చేకూర్చాలని చూసారో, మేము కూడా అలాగే చెయ్యాలి కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
అయితే ఇటీవల మాత్రం కొంచెం ఆసక్తి రేకెత్తించే వ్యాఖ్యలనే ఆయన చేసారు. బాబు గారు ఎలా అయితే అక్కడ రాజకీయాల్లో తెరాసకు వ్యతిరేఖంగా ప్రచారం చెయ్యడానికి వచ్చారో. ఇప్పుడు ఇక్కడ బాబుకి షాకిచ్చేందుకు కెసిఆర్ తనయుడు కేటీఆర్ రాబోతున్నారని ఖరాఖండిగా చెప్పేసారు. అలాగే కెసిఆర్ కూడా అతి త్వరలోనే వచ్చి బాబుకి సరైన రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆంధ్రాలో టిఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్లు ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నాయి.
Top