జగన్ అలా చేస్తే టిడిపి గెలవడం ఖాయమని అంటున్న ఎంపి..!

Written By Xappie Desk | Updated: January 17, 2019 12:05 IST
జగన్ అలా చేస్తే టిడిపి గెలవడం ఖాయమని అంటున్న ఎంపి..!

ఏపీలో ఎన్నికలు మరి కొద్ది నెలలలో రాబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలలో వస్తున్న ఫలితాలు చూస్తే ఖచ్చితంగా 2019లో వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అన్నట్టుగా ఉంది. ఇటువంటి సమయంలో జగన్ మరియు కేటీఆర్ భేటి అవడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉన్నట్లు గా చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. కారణం గతంలో ఆంధ్ర రాష్ట్రం విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మరియు ప్రాంతీయ భేదం సృష్టించే విధంగా చేసిన కామెంట్లు.
 
అయితే తాజాగా జగన్ మరియు కేటీఆర్ భేటీపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మోడీతో కలిసి జగన్ మరియు కేసీఆర్ ఆడుతున్న నాటకమని దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఒంట‌రిగా వ‌స్తే.. టీడీపీకి 130 సీట్లు ఖాయ‌మ‌ని, అదే కేసీఆర్‌తో వ‌స్తే 160 సీట్లు వ‌స్తాయ‌ని కేసినేని నాని జ్యోస్యం చెప్పారు. ప్ర‌ధాని నరేంద్ర‌మోదీని కాప‌డ‌డానికే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను తెర‌పైకి తెచ్చార‌ని, అందులో భాగంగానే తాజాగా జ‌గ‌న్‌తో కేటీఆర్ భేటీ అయ్యార‌ని నాని విమర్శల వర్షం కురిపించారు. దేశ ప్రజలను మరియు రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మోడీని మరియు జగన్ ని ప్రజలు రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తారు అని పేర్కొన్నారు.
Top