మొత్తానికి బయట పడిపోయారు అంటున్న లోకేష్..!

Written By Xappie Desk | Updated: January 17, 2019 12:10 IST
మొత్తానికి బయట పడిపోయారు అంటున్న లోకేష్..!

తాజాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ మరియు టిఆర్ఎస్ పార్టీ నేత కెటిఆర్ ఇద్దరు లోటస్పాండ్లో బేటి అవడంపై తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు సంచలన కామెంట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా చీకటిలో దాగి ఉన్న ఈ రెండు పార్టీల బంధం తాజాగా ఏపీలో ఎన్నికలకు ముందు బయట పడిపోయిందని అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఢిల్లీ మోడీ, ఆంధ్రా మోడీ, తెలంగాణ మోడీ ఒక్కటయ్యారని, ఇన్ని రోజులు ముసుగు కప్పుకొని తిరిగిన వీరందరూ ఇప్పుడు వెలుగులోకి వచ్చారని అంతే కాకుండా , ఇంత కాలం వీరి మధ్య ఉన్న చీకటి ఒప్పందం ఇప్పుడు బహిర్గతం అయ్యిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసిన ఈ ముగ్గురిని త్వరలో రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు అని అంటున్నారు.
 
విభజన చట్టం ప్రకారం… ఏపీకి రావాల్సిన నిధులను, వాటాలను రాకుండా అడ్డుపడుతున్నటువంటి తెలంగాణ సీఎం కెసిఆర్ తో జగన్ కలిసి, కొత్తగా ఆంధ్రా ద్రోహుల ఫ్రంట్ ఏర్పాటు చేశారంటూ విమర్శించారు. గతంలో ఆంధ్ర ప్రాంత ప్రజలను దారుణంగా విమర్శించిన కేసీఆర్ తో జగన్ చేతులు కలపడం సిగ్గుచేటు అంటూ దారుణంగా కామెంట్లు చేశారు లోకేష్. ఏది ఏమైనా ఎన్నికల ముందు తమ బంధాలను వెలుగులోకి తీసుకు వచ్చి బయట పడిపోయారని పేర్కొన్నారు.
Top