జగన్- కేటీఆర్ ల భేటీ పై సోషల్ మీడియాలో సంచలన విశ్లేషణ..!

By Xappie Desk, January 17, 2019 12:18 IST

జగన్- కేటీఆర్ ల భేటీ పై సోషల్ మీడియాలో సంచలన విశ్లేషణ..!

పొత్తు పెట్టుకోవడానికి ఆరాట పడే వాడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడతారో వారి దగ్గరికి వెళ్తారు. 2014 ఎన్నికల్లో ఒకసారి గమనిస్తే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పొత్తు పెట్టుకుని ఆయన మద్దతు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జగన్ మరియు కేటీఆర్ అయినా భేటీపై టీడీపీ నేతలు మరియు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొన్ని మీడియా చానళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించడంపై కథనాలు ప్రసారం చేయడం పై సోషల్ మీడియాలో ఒక నెటిజన్ చేసిన విశ్లేషణ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకసారి ఆంధ్ర రాష్ట్రాన్ని గమనిస్తే ఆంధ్ర ప్రాంతానికి ఉద్యోగాలు రావాలన్నా ఆ ప్రాంతంలో ఉన్న యువకులు జీవితాలు మెరుగుపడాలన్నా పారిశ్రామికంగా ఎదగాలన్న ప్రత్యేక హోదా అవసరమని ముందు నుంచి చెబుతున్న వ్యక్తి రాజకీయ నాయకుడు జగన్ అని పేర్కొన్నారు.
 
ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆ ప్రాంతం కచ్చితంగా అభివృద్ధి చెందాలని అయితే ఆంధ్ర రాష్ట్రానికి పక్కనే ఉన్న హైదరాబాద్ మరియు బెంగళూరు ప్రాంతాలు చెన్నై వంటి ప్రాంతాలు అద్భుతమైన అభివృద్ధి లో ఉంటే ఆంధ్రాలో పెట్టుబడులు రావటం అసాధ్యం అని దీంతో ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వ్యక్తి జగన్, ఎన్నికలు రాకముందు మరియు ప్రత్యేక ప్యాకేజీ బెటర్ అని చంద్రబాబు చెప్పిన సమయంలో కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక్క రాజకీయ నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే బెటర్ అని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఇది తన స్వార్ధ రాజకీయాలకోసం కాదని రాజకీయ మైలేజీ కోసం అంతకంటే కాదని అనేక ప్రాంతాలలో యువభేరి లు నిర్వహించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో రాష్ట్రంలో ఏ రాజకీయనాయకుడు స్పందించని సమయంలో ప్రత్యేక హోదాపై జగన్ అద్భుతంగా నిలబడ్డారని ఇదే క్రమంలో త్వరలో ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తాజాగా టిఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా రాణించాలని చూస్తున్న సమయంలో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని తన ఇంటి వద్దకు తన రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరే విధంగా జగన్ అద్భుతమైన రాజకీయాన్ని పండించారని.. ఇదే క్రమంలో తమ పక్క రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం తెలుగు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది వాటిలో మనం కూడా భాగం అవుతామని కేటీఆర్ వంటి నాయకులు కూడా ఆంధ్ర ప్రజల కోసం పార్లమెంటులో పోరాటానికి రెడీ అని చెప్పడం నిజంగా సంతోషదాయకమని..ఇది రెండు రాష్ట్ర ప్రజలకు శుభ సూచకమైన రాజకీయ వాతావరణం అని సదరు నెటిజన్ పేర్కొన్నాడు.
 
ఇటువంటి విషయంలో పొత్తులు...కక్షసాధింపు రాజకీయాలు పగ ప్రతీకారాలు అంటూ ఆంధ్రాలో ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఏపీ లో ఉన్న రాజకీయ నేతలు మాట్లాడకూడదని కేవలం ఇది ఆంధ్ర ప్రజలకు సంబంధించిన విషయమని ఈ విషయంలో జగన్ ముందునుండి ఒకే మాటపై ఉండటంతో పార్లమెంటులో ఏపీ కి స్పెషల్ స్టేటస్ కోసం వాయిస్ వినిపించడంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీల అవసరం కూడా ఎంతో ఉండటంతో జగన్ మరియు కేటీఆర్ భేటీలను తప్పుగా చిత్రీకరించ వద్దని అలా చిత్రీకరించి ప్రజలలో చులకన అవ్వదని... సదరు నెటిజన్ పేర్కొన్నారు.Top