జగన్ తీసుకొన్ననిర్ణయం కరెక్ట్ అని అంటున్న సీనియర్ జాతీయ రాజకీయ నేతలు..!

Written By Xappie Desk | Updated: January 18, 2019 12:42 IST
జగన్ తీసుకొన్ననిర్ణయం కరెక్ట్ అని అంటున్న సీనియర్ జాతీయ రాజకీయ నేతలు..!

కర్నూలులో జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఆ ఎఫెక్ట్ పార్టీ మీద పడకుండా పార్టీ క్యాడర్ నిరుత్సాహపడకుండా వెంటనే పార్టీ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించి ఆంధ్రాలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశారు వైసీపీ అధినేత జగన్. ముఖ్యంగా 2014 ఎన్నికలలో అతి తక్కువ స్వల్ప మెజారిటీతో అధికారం కోల్పోయిన జగన్ కచ్చితంగా 2019 లో అధికారం చేపట్టాలని మంచి కసి మీద ఉన్నాడు. దీంతో ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వం పై ఉన్న ప్రజా వ్యతిరేకతను అద్భుతంగా బయటకు తీసుకువచ్చారు.
 
దీంతో జగన్ ఎఫెక్ట్ వల్ల కూటమిగా ఉన్న టిడిపి బిజెపి జనసేన పార్టీలు మూడుగా చీలి పోయాయి. తన పాదయాత్రలో అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అవినీతి ని బయటకు తీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా ప్రజలను మోసం చేశారు అన్న విషయాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రసంగిస్తూ పాదయాత్ర చేశారు జగన్. దాదాపు 14 నెలల పాటు పాదయాత్ర చేపట్టిన జగన్ కి రాష్ట్రంలో అద్భుతమైన మైలేజ్ వచ్చింది... ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్వహించిన అన్ని సర్వేలలో కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఫలితాలు కూడా తేల్చేశాయి . అయితే తాజాగా టిఆర్ఎస్ పార్టీ తో దగ్గరగా మెలుగుతున్న జగన్ ని చూసి ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు పాదయాత్ర కి వచ్చిన మైలేజ్ టిఆర్ఎస్ పార్టీ తో కలసి పోగొట్టుకునే అవకాశాలు ఉన్నట్లు కామెంట్ చేస్తున్నారు.
 
అయితే మరోపక్క జగన్ టిఆర్ఎస్ పార్టీ తో కలవడం ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేకూరే విషయమేనని చాలామంది తల పండిపోయిన జాతీయ రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి గెలిచే అవకాశాలు జగన్ కి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పార్లమెంట్లో చట్టపరంగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో ముందునుండి తెలివిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారని జగన్ పై కామెంట్లు చేస్తున్నారు.
Top