జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించిన కే ఏ పాల్..!

By Xappie Desk, January 18, 2019 12:55 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించిన కే ఏ పాల్..!

ఆంధ్రాలో సీరియస్ గా రాజకీయాలు జరుగుతున్న క్రమంలో కే ఏ పాల్ చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యాన్ని నవ్వుని కలిగిస్తున్నాయి. ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే ఏ పాల్ ప్రస్తుతం ఆంధ్ర లో రాబోతున్న ఎన్నికలలో పోటీ చేపడుతున్నట్లు తనతో కలిసి రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పిలుపునిచ్చారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ కే ఏ పాల్ ఈనెల 26న బెజవాడ లో జరగబోయే ర్యాలీకి రావాలని సోషల్ మీడియాలో ఆహ్వానించారు.
 
ప్రపంచ రాజకీయాలలో అనేకమంది దేశ అధ్యక్షుల్ని నియమించేది నేనే అంటూ 2019 ఎన్నికల్లో ఆంధ్రాలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండేది నేనే అని.. ప్రస్తుతం ఉన్న ఇద్దరు నేతలను ప్రజలు తిరస్కరించే రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు ఏపీలోని రాజకీయ నాయకుల్లో తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని గాల్లో ముద్దులు ఎగరేస్తున్నారు.
 
రాబోయే ఎలక్షన్లకు జనసేనానిని తనతో కలిసి నడవమని ఆహ్వానిస్తున్నారు. తన ఇంటికి ఆయన వచ్చినా పర్వాలేదని, లేకపోతే తానె ఆయన ఇంటికి వెళతానని చెబుతూ సోషల్ మీడియాలో పవన్ నా నెంబర్ తెలుసు కదా ఫోన్ కొట్టు మాట్లాడుకుందాం అంటున్నారు. దీంతో కె పాల్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.Top