త్వరలో ఏపీలో జగన్ మరియు కేసీఆర్..?

Written By Xappie Desk | Updated: January 18, 2019 13:00 IST
త్వరలో ఏపీలో జగన్ మరియు కేసీఆర్..?

వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఆంధ్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది అని అందరికీ తెలుసు. తన పాదయాత్రతో ఆంధ్రాలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసిన జగన్ తాజాగా ఇటీవల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి నిర్వహించిన సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు జాతీయ రాజకీయాలలో కూడా పెను సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన ఏపీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు ని గద్దె దించడానికి టిఆర్ఎస్ పార్టీ మరియు వైసిపి పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆంధ్ర ప్రాంతాన్ని దారుణంగా విమర్శించిన కెసిఆర్ తో జగన్ కలవడం ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసినట్లు అవుతుందని ఇద్దరి భేటీపై టిడిపి నేతలు ఈ విధంగా కామెంట్లు చేస్తున్నారు.
 
ఇదిలా ఉండగా ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ త్వరలోనే అమరావతిలో తాను నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని మరియు సొంత ఇంటిని ప్రారంభించబోతున్నట్టు ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూడా రాబోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. దీంతో ఈ కార్యక్రమానికి కచ్చితంగా కేసీఆర్ వస్తే మాత్రం మన ఆంధ్రాలో తన పాదయాత్రను తో వచ్చిన మైలేజ్ పూర్తిగా పోతుందని కేసిఆర్ తో జగన్ కలవడం ఆ పార్టీకి చాలా డామేజ్ అయ్యా అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క సీనియర్ రాజకీయ నేతలు ఆంధ్ర కి ప్రత్యేక హోదా రావాలంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా నినాదం గట్టిగా విన్న పడాలంటే జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టేనని వాదిస్తున్నారు.
Top