సవాల్ విసిరిన చంద్రబాబు..!

By Xappie Desk, January 18, 2019 13:04 IST

సవాల్ విసిరిన చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోపక్క విపక్ష పార్టీ నేతలను కడిగి పారేస్తున్నాడు. మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎక్కువగా ప్రజలతోనే గడుపుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రసంగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఉందని ఇటీవల పాల్గొన్న జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే అది నా అనుభవం వల్లే అని ఇటువంటి అభివృద్ధి ఇంకా కొనసాగించాలంటే రాబోయే రోజుల్లో టిడిపిని ఆదరించాలని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న రాజకీయ దుష్టశక్తులను వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలని ఇటీవల పేర్కొన్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే కొంతమంది రాజకీయ నేతలకు అసూయపడుతుందని చంద్రబాబు సంచలన కామెంట్లు చేశారు. ఏమీ లేకపోయినా కోడి కత్తి కేసును కేంద్రం ఎన్‌ఐఏకి అప్పగించిందని మండిపడ్డారు. కోడి కత్తి కేసులో బెయిల్‌ కూడా రాకుండా కేసులు నమోదు చేశామన్నారు. జగన్‌ ఫిర్యాదు చేయకపోయినా సీరియస్‌గా దర్యాప్తు చేశామని చెప్పారు. రాష్ట్ర అధికారాలపై కేంద్రం జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. దేశ వ్యవస్థలపై జగన్‌కు నమ్మకం లేకుంటే ఏ దేశంతో విచారణ కోరతారని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చంద్రబాబు సవాల్ విసిరారు.


Tags :


Top