బాబుకి కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ జగన్ రూపంలో ఉంటుందా..?

Written By Xappie Desk | Updated: January 19, 2019 10:42 IST
బాబుకి కెసిఆర్ రిటర్న్ గిఫ్ట్ జగన్ రూపంలో ఉంటుందా..?

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనకు వ్యతిరేకంగా తన రాష్ట్రంలో తెలంగాణలో మహా కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన ఏపీ సీఎం చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఆ సందర్భంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ గిఫ్ట్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు ప్రస్తుతం చర్చలు జరుపుతున్న విషయం అందరికీ తెలిసినదే. అయితే మరి కొద్ది నెలల్లో ఏపిలో కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బాబుకి కెసిఆర్.. జగన్ తోనే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అని సందేహం వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కెసిఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ గురించి గుంటూరులో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు.
 
కెసిఆర్ తనకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడుతున్నాడని,తాను ఒక గిఫ్ట్ ఇస్తే నేను తిరిగి మూడు గిఫ్టులు ఇస్తానే తప్ప వదిలి పెట్టే సమస్యే లేదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇవ్వడానికే తన అవినీతి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి యొక్క కోడి కత్తి పార్టీని పట్టుకున్నాడని వ్యాఖ్యానించారు. మీ ఇద్దరు కలిసినా సరే మమ్మల్ని ఏమి చెయ్యలేరు అంటూ చంద్రబాబు ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని పేర్కొన్నారు చంద్రబాబు.
Top