అసెంబ్లీ లో కి జగన్..?

Written By Xappie Desk | Updated: January 19, 2019 10:53 IST
అసెంబ్లీ లో కి జగన్..?

ప్రతిపక్ష నేత అనేవాడు ప్రజల తరఫున పోరాడాలంటే అది అసెంబ్లీ వేదిక అని రోడ్డుమీద పాదయాత్రలు చేసుకుంటూ పోతే ప్రజా సమస్యలు పరిష్కరించడం కష్టమని ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ గురించి ప్రత్యర్థి పార్టీలు మరియు అధికార పార్టీకి చెందిన నేతలు కామెంట్లు చేశారు. ప్రస్తుతం పాదయాత్ర ముగించుకుని ఎన్నికలకు వ్యూహాలు పన్నుతున్న జగన్ త్వరలో బస్సు యాత్ర కు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు జగన్ గ్రాఫ్ చూస్తే బాగానే ఉన్నా ఒక అసెంబ్లీ విషయంలో మాత్రం ఆయన గైర్హాజర్ అవ్వడం మన పార్టీకి మరియు ఆయన పొలిటికల్ కెరియర్ కి కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా జ‌న‌వ‌రి 30 నుండి ఫిబ్ర‌వ‌రి 7 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ చివ‌రి స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి.
 
ఈ స‌మావేశాల్లో కీల‌క‌మైన అంశాలు చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ్ళ‌నున్నారా అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ ఇప్పుడు ఒక‌వైపు బ‌స్సుయాత్ర కోసం సిద్ధ‌మ‌వుతుండ‌గా.. మ‌రోవైపు అభ్య‌ర్ధుల‌ను సెట్ చేసుకునే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ‌తారా అనేది ఆశ‌క్తిక‌రంగా మారింది. ఒక‌వేళ నిజంగానే జ‌గ‌న్ అసెంబ్లీకి వెళితే ఆ పార్టీకి బ్ర‌హ్మాస్త్ర‌మే అవుతుంద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒకవేళ అసెంబ్లీలోకి వెళ్లేనా దాదాపు 13 జిల్లాలలో పాదయాత్ర చేసి స్పష్టమైన ప్రజా సమస్యలను తెలుసుకున్న జగన్ కి అసెంబ్లీలో అధికార పార్టీ మైక్ ఇస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఇస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇరకాటంలోకి పెడతారు జగన్.
Top