లండన్ పర్యటన రద్దు చేసుకున్న జగన్..!

Written By Xappie Desk | Updated: January 19, 2019 11:12 IST
లండన్ పర్యటన రద్దు చేసుకున్న జగన్..!

ఇటీవల ప్రజా సంకల్ప పాదయాత్ర ముగించుకుని జగన్ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో తన నివాసంలో భేటీ అయ్యారు దాదాపు రెండు గంటల పాటు జాతీయ రాజకీయాలలో కేసిఆర్ ఏ విధంగా వ్యవహరించబోతున్నారు వంటి విషయాలను వైసీపీ అధినేత జగన్ కు సూచించారు అంతేకాకుండా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి కూడా జగన్ కి తెలియజేశారు కేటీఆర్. అయితే మరోపక్క జగన్ కూడా తన రాష్ట్రమైన ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుండి పోరాడుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో బలం రావాలంటే కచ్చితంగా ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు ఏపీకి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో పోరాడాలని ఆ వాయిస్ వినిపించాలంటే కలసి వెళ్లాలని తేల్చుకున్న నేపథ్యంలో కేటీఆర్ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తామని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
 
ఇదే క్రమంలో కేటీఆర్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పాదయాత్ర ముగించుకున్న జగన్ హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న కుమార్తెతో గడిపి ఈ నెల 22న తిరిగి హైదరాబాద్ రావాలన్నది జగన్ షెడ్యూల్. అయితే మరోపక్క ఎన్నికలకు కొద్ది స‌మ‌య‌మే ఉండ‌టంతో ప్రధాన పార్టీలు అస్త్ర‌, శ‌స్త్రాలు సిద్దం చేసుకొనే ప‌నిలో ప‌డ్డాయి. ఈ నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా వైసీపీ ఒక ప్రకటనలో తెలిపాయి.
Top