సంచలనం చంద్రబాబుతో భేటీ అయిన లగడపాటి..!

Written By Xappie Desk | Updated: January 19, 2019 12:47 IST
సంచలనం చంద్రబాబుతో భేటీ అయిన లగడపాటి..!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మహా కూటమి అధికారంలోకి వస్తుందని టిఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుందని ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి తెలంగాణ ఎన్నికల రాకముందు కామెంట్లు చేశారు. తీరా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లగడపాటి సర్వే అంతా బూటకమని తేలిపోయింది. దీంతో ఆయన సర్వే పై అనేక విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా చాలా రోజుల తర్వాత లగడపాటి రాజగోపాల్ చంద్రబాబుని ఇటీవల కలవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక కామెంట్లు వినబడుతున్నాయి. ఉండ‌వ‌ళ్లిలోని ముఖ్య‌మంత్రి నివాసంలో ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ బాబుతో భేటీ అయ్యారు. చాలా రోజుల త‌ర్వాత క‌ల‌వ‌డంపై అనేక ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
మరికొద్ది నెలల్లోనే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయనే దానిపై లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏదైనా నివేదిక ఇచ్చారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇరువురి భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే అంశం సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. వీరిద్దరి మధ్య జరిగిన చర్చించిన విషయాల గురించి ఏవీ కూడా బయటకు రాలేదు. మరోపక్క విపక్ష పార్టీలు లగడపాటి తో దొంగ సర్వేలు చేయించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా విష ప్రచారం చేయించాలని ప్రజల దృష్టిని మరల్చాలని వీరిద్దరు స్కెచ్ వేస్తున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీలో ఎవరు ఏం చేస్తున్నారు అన్న విషయంపై ప్రజలు చాలా క్లారిటీ గా ఉన్నారని మరికొంతమంది నేతలు పేర్కొంటున్నారు.
Top