బేటి కోసం డేట్ మరియు ప్లేస్ ఫిక్స్ చేసుకున్న కెసిఆర్, జగన్..?

Written By Xappie Desk | Updated: January 19, 2019 12:52 IST
బేటి కోసం డేట్ మరియు ప్లేస్ ఫిక్స్ చేసుకున్న కెసిఆర్, జగన్..?

జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ బీజేపీయేతర కూటమి వస్తేనే దేశం అభివృద్ధి జరుగుతుందని బలంగా నమ్ముతున్న టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దానికి తగ్గ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. ఇటీవల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిశారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ లో వైయస్ జగన్ హవా కొనసాగుతున్న క్రమంలో ఆయనతో కూడా భేటీ అవ్వడానికి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకుని ఇటీవల ఆయన తనయుడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీ లోటస్ పాండ్ కి పంపించి జగన్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు.
 
ఇప్పటికే జగన్ మరియు కేటీఆర్ భేటీ లా గురించి ఏపీ మీడియా మరియు రాజకీయ నేతలు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్న మరోపక్క జగన్ తన పని తాను చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటిదాకా హైదరాబాదు నుండి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించిన వైసీపీ అధినేత జగన్.. త్వరలో అమరావతి రావడానికి సిద్ధమైపోయారు. ఆంధ్ర రాజధాని ప్రాంతంలో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని మరియు గృహాన్ని కట్టిస్తున్న జగన్ వాటి లోకి ఎంటర్ అవ్వడానికి రెడీ అయ్యారు. మరోపక్క కేసీఆర్ కూడా జగన్తో భేటీ అవ్వడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీకి డేట్, టైమ్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో తాను నిర్మించుకున్న ఇంట్లో ఫిబ్రవరి 14న గృహ ప్రవేశ ముహూర్తాన్ని నిశ్చయించుకున్న జగన్ .. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎంను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Top