బెజవాడ రాజకీయాలలో జగన్ కి ఊహించని షాక్..!

Written By Xappie Desk | Updated: January 21, 2019 12:23 IST
బెజవాడ రాజకీయాలలో జగన్ కి ఊహించని షాక్..!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం రోజుకో లా మారుతుంది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన బెజవాడలో రాజకీయాలు ఒక్కసారిగా క్షణక్షణానికి ఒక్కో లా మారటం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తున్న వైసీపీకి ఈ ప్రాంతంలో ఎదురుగాలి వీస్తోంది. బెజవాడ ప్రాంతంలో రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండే వంగవీటి రాధా తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇంతకి విషయం ఏమిటంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నుండి టికెట్ ఆశించిన వంగవీటి రాధా కు వైసీపీ పార్టీ నుండి సరైన స్పష్టత రాకపోవడంతో ఇక చేసేదేమి లేక ఈ రోజు రాజీనామా చేసేసారు. ఎప్పటి నుంచో జగన్ వైఖరి పట్ల రాధా అసంతృప్తిగా ఉన్నా ఆయన ఏమన్నా నిర్ణయం మార్చి తనకి న్యాయం చేస్తారేమో ఎన్ని ఎదురు చూసారు కానీ జగన్ వైపు నుంచి ఎలాంటి సానుకూల సూచనలు రాకపోవడంతో రాధా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కి లేఖ రాశారు. ప్రస్తుతం వంగవీటి రాధా రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది.
Top