రోజుకొక మలుపు తిరుగుతున్న జగన్ కోడి కత్తి కేసు..!

Written By Xappie Desk | Updated: January 21, 2019 12:29 IST
రోజుకొక మలుపు తిరుగుతున్న జగన్ కోడి కత్తి కేసు..!

వైసీపీ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి కేసు ఇటీవల ఏపీ హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపడుతున్న ఈ కేసుపై రోజుకొక సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ పై దాడి చేయించింది తెలుగుదేశం పార్టీయేనని ముందు నుంచి కామెంట్లు చేస్తున్నారు వైసిపి పార్టీకి చెందినవారు. ఇదే క్రమంలో ఏపీ రాష్ట్ర విచారణ సంస్థ సిట్ బృందం వారు ఏమో జగన్ పై దాడి జరిగిన మరుక్షణమే నిందితున్ని పూర్తిగా సోదా చెయ్యాలి. ఆ సమయంలో ఎలాంటి కత్తి కూడా దొరకలేదు. సరిగ్గా ఒక్క రోజు తర్వాత నిందితుని దగ్గర మరో చిన్న కత్తి ఉందని వారు తెలిపారు.
 
అయితే ఈ విషయం పై ఎన్ఐఏ వారు విశాఖ ఎయిర్ పోర్ట్ వారి భద్రతా సిబ్బంది ఎంత పటిష్టంగా పనిచేస్తున్నారో అని ఒక ట్రిక్ వాడారు. అక్కడ 75 రూపాయల టికెట్ కొనుకొని వెళ్లే దారిలో అసలు ఎలాంటి చెకింగ్ కూడా లేదని ఆ దారిలో తుపాకులు పట్టుకెళ్లినా కూడా ఎవ్వరు తనిఖీలు చెయ్యడం లేదని తెలిపారు. దానితో శ్రీనివాస్ దగ్గర రెండో కత్తి దొరకడం పట్ల అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. అలాగే అక్కడి ఎయిర్ పోర్ట్ లో సిట్ బృందం వారికి జగన్ పై దాడి జరిగిన విఐపి లాంజ్ లో కేవలం ఒక నెలకి సంబందించిన వీడియో సమాచారం మాత్రమే దొరికిందని వారు తెలిపారు. ఇక ఈ విషయం పై ఎన్ఐఏ వారు పరిశీలించగా వారు ఏకంగా మూడు నెలల వీడియో సమాచారాన్ని రాబట్టారు. దీంతో ప్రస్తుతం ఉన్న పరిణామాలు బట్టి చూస్తుంటే కేసును తప్పుదోవ పట్టించే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Top