పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా..!

By Xappie Desk, January 21, 2019 12:42 IST

పవన్ కళ్యాణ్ పై విష ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే ఒక మీడియా వర్గం తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దృష్టి సారించింది. ఏదో ఒక విషయం పట్టుకుని లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి టీడీపీకి వ్యతిరేకంగా ఉండే నాయకులను మరియు పార్టీలపై విష ప్రచారం చేసే ఎల్లో మీడియా పవన్ కళ్యాణ్ స్నేహితుడు అయినా అలీ ని అడ్డం పెట్టుకుని నీచాతి నీచమైన ప్రసారాలకు, కథనాలకు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తోంది.
 
తాజాగా ఇటీవల ఆలీ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్నట్లు అనేక వార్తలు వస్తున్న క్రమంలో ఆలీ ని అడ్డం పెట్టుకుని పవన్ పై మరో సారి విష ప్రచారం జరుగుతునట్టుగా కనిపిస్తుంది. అలీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కలిసి మాట్లాడారని, గుంటూరు ఎంపీ టికెట్ కోసం అలీ బాబుతో చర్చించారని వార్తల్లో చెప్తున్నారు. మరి దీని వల్ల పవన్ ఎలాంటి నష్టము లేదు, పవన్ తన పార్టీలోకి కూడా తన సన్నిహితులను రావద్దని దూరంగానే ఉంచారు.
 
ఇన్ని కనిపిస్తున్నా సరే “పవన్ కి ఊహించని షాక్ టీడీపీ లోకి పవన్ ప్రాణ స్నేహితుడు అలీ” అంటూ పచ్చ మీడియా మళ్ళీ ప్రచారం చెయ్యడం మొదలు పెట్టడం...పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అన్నట్టుగా కథనాలు ప్రసారం చేస్తూ పవన్ అభిమానులను మరియు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలలో ఆందోళనలు కలిగించే విధంగా వ్యవహరించడంతో సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు మరియు పవన్ అభిమానులు ఎల్లో మీడియా పై మండిపడుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ ని రాజకీయాలలో ఆపడం ఎవరి తరం కాదని పేర్కొంటున్నారు.Top