రాబోయే ఎన్నికల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ..!

By Xappie Desk, January 21, 2019 12:49 IST

రాబోయే ఎన్నికల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ..!

దేశంలో తనకు వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమిపై ఆ కూటమిలో ఉన్న నాయకులపై మరియు రాబోయే ఎన్నికల విషయంలో బిజెపి పార్టీ వ్యవహరించే తీరుపై స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు మోడీ. రాబోయే ఎన్నికలలో బిజెపి పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని దేశంలో మేం చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రజల తో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తనకు వ్యతిరేకంగా కోల్కతాలో జరిగిన ర్యాలీ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాం కారణంగా కొందరు రాజకీయ నేతలు దళారులుగా అవతారమెత్తారని విమర్శించారు.
 
అంతేకాకుండా మహారాష్ట్ర, గోవా ప్రాంతాలకు సంబందించిన బీజేపీ కార్యకర్తలతో భేటీ అయిన ఆయన మోడీ మహాకూటమిపై విమర్శనాస్త్రాలు వదిలారు. ఏదిఏమైనా కూడా ప్రజలకు సేవ చేయడం ఒక్కటే పనిగా పెట్టుకోవాలని, మనం మాత్రం ప్రజల కోసమే పనిచేయాలని తెలిపారు. కోల్‌కతా ర్యాలీకి హాజరైన నేతల్లో దాదాపుగా రాజకీయ లబ్ధికోసం వెళ్లినవారే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన ఎలాంటిదో ప్రజలందరికి తెలుసనీ, ప్రజలను మోసం చేయడమే లక్ష్యం గా పెట్టుకొని పాలించారని మోడీ విమర్శించారు. దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.Top