రాజకీయాలలో కేటీఆర్- జగన్ లు వేసిన అడుగుకి బెదిరిపోతున్న చంద్రబాబు..?

Written By Xappie Desk | Updated: January 21, 2019 12:51 IST
రాజకీయాలలో కేటీఆర్- జగన్ లు వేసిన అడుగుకి బెదిరిపోతున్న చంద్రబాబు..?

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు విచిత్రం గా వ్యవహరిస్తున్న రోజులలో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం రాష్ట్రానికి రావాల్సిన హక్కుల విషయంలో దారుణంగా విఫలం అవడంతో కేటీఆర్ మరియు జగన్ లు అద్భుతమైన నిర్ణయం తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల కు కేంద్రం నుండి ఎటువంటి అన్యాయం జరగకుండా భవిష్యత్తు అడుగులు వేస్తున్నారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు.
 
తన స్వార్ధ రాజకీయాలకోసం పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా విషయంలో దారుణంగా విఫలమైన చంద్రబాబు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం టిడిపి పార్టీ కి కొంత డామేజ్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ ఎన్నికల ముందు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం అయితే ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ గెలవడం వెంటనే ఏపీలో ఎక్కువ విజయవకాశాలు ఉన్న జగన్తో జాతీయ రాజకీయాలలో అడుగులు వేసే ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో ఇటు చంద్రబాబు మరియు టిడిపి నేతలు తెగ బెదిరిపోతున్నారని కలసి పని చేయాల్సిన సమయంలో చంద్రబాబు కెసిఆర్ కి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారిగా తమకు అనుగుణంగా ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని కూలదోయాలని చూసిన చంద్రబాబు కి ప్రస్తుతం కేసీఆర్ మరియు జగన్, కేటీఆర్ లు వేస్తున్న అడుగులు భయాన్ని సృష్టిస్తున్నాయని కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Top