మోడీకి వ్యతిరేకంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో భారీ ర్యాలీ..!

Written By Xappie Desk | Updated: January 21, 2019 12:57 IST
మోడీకి వ్యతిరేకంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతి లో భారీ ర్యాలీ..!

ఏపీకి రావాల్సిన విభజన హామీల లో మోడీ ప్రభుత్వం మొండితనంగా దారుణంగా వ్యవహరించిందని రాష్ట్రాన్ని అన్యాయం చేసిందని గత కొన్నాళ్ల నుండి మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఇదే క్రమంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దేశంలో మోడీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో చాలా పార్టీలు ఏకం అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా మమతాబెనర్జీతో మోడీకి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకున్నారు. ఇదే క్రమంలో ఇటీవల కోల్‌కత్తా నగరంలో మోడీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ భారీ స్థాయిలో చేసిన ర్యాలీ జాతీయస్థాయిలో సంచలనం అయ్యింది.
 
ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ కోల్‌కతా ర్యాలీ తరహాలో త్వరలో అమరావతిలో భారీగా విపక్షాల ర్యాలీ నిర్వహించను న్నట్లు ప్రకటించారు. యునైటెడ్‌ ఇండియా ర్యాలీలో శనివారం మాట్లాడుతూ మోడీ సర్కారును అధికారంనుండి తొలగించడానికి తామంతా ఏకమైనట్లు ప్రకటించారు. అమరావతి ర్యాలీకితాను తప్పకవస్తా నని ఈ సందర్భంగా బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ప్రకటించడం విశేషం.
 
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో బిజేపేతర పార్టీలచే కోల్‌కత్తాలో శనివారం నిర్వహించిన మెగా ర్యాలీ చారిత్రాత్మకమని బెంగాలీ భాషలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్రాల హక్కుల సాధనలో బిజేపేతర రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం నిర్వీర్యంచేస్తుందని ఆయన దుయ్య బట్టారు. మమతా బెనర్జీ చేపట్టిన ర్యాలీ జాతీయస్థాయిలో బిజేపేతర పార్టీలు, బిజేపేతర రాష్ట్రప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకొని బిజేపిని పాలన నుంచి సాగనంపాలని ఆయన విజ్ఞప్తిచేశారు. బీజేపీ వంటి రాజకీయ శక్తుల దేశంలో ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని పేర్కొన్నారు చంద్రబాబు.
Top