వంగవీటి రాధా పై సంచలన వ్యాఖ్యలు చేసిన కే ఏ పాల్..!

Written By Xappie Desk | Updated: January 22, 2019 12:07 IST
వంగవీటి రాధా పై సంచలన వ్యాఖ్యలు చేసిన కే ఏ పాల్..!

బెజవాడ రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీ కి సంబంధించిన కీలక నేత వంగవీటి రాధా ఇటీవల పార్టీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో వంగవీటి రాధా జనసేన పార్టీ గానీ మరియు తెలుగుదేశం పార్టీలో గానీ చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు బయటకు రావడంతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధా కి ప్రత్యేకమైన ఆహ్వానం పంపించిందని వార్తలు వస్తుండటంతో ఆ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా ఎక్కువగా టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ వంగవీటి రాధాపై సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు.
 
వైసీపీకి వంగ‌వీటి రాధా రాజీనామా చేసి మంచి ప‌ని చేశార‌ని, అయితే టీడీపీకి వెళుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్న నేప‌ధ్యంలో ఆయ‌న ఒక‌సారి ఆలోచించుకోవాల‌ని పాల్ అన్నారు. నాడు వంగ‌వీటి రంగాను ఎవ‌రు చంపారు.. ఏ పార్టీ చంపిందో రాధా ఒక‌సారి గతాన్ని గుర్తు చేసుకోవాల‌ని సూచిస్తూ.. ఇండైరెక్ట్‌గా అధికార టీడీపీ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై ఆందోళ‌ణ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, రాష్ట్రంలో కాపుసామాజిక‌వ‌ర్గాన్ని ఏక‌తాటి పై తీసుకురావ‌డానికి కృషి చేయాల‌ని, వంగ‌వీటి రంగాను ఎవ‌రైతే చంపారో వారికి గుణ‌పాఠం చెప్పాల‌ని కేఏపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో కె పాల్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top