హైపర్ ఆది కి చుక్కలు చూపించిన వైసీపీ పార్టీ కార్యకర్తలు..!

By Xappie Desk, January 22, 2019 12:13 IST

హైపర్ ఆది కి చుక్కలు చూపించిన వైసీపీ పార్టీ కార్యకర్తలు..!

తెలుగు కామెడీ షో జబర్దస్త్ లో కంటెస్టెంట్ అయినా ఫేమస్ కమెడియన్ హైపర్ ఆది ఇటీవల జనసేన పార్టీ తరఫున ప్రచారంలోకి దిగారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది జబర్దస్త్ ప్రోగ్రాం లో అద్భుతమైన పంచులు వేస్తే నాన్ స్టాప్ గా కడుపుబ్బా నవ్వించే వాడు. ఇటీవల జబర్దస్త్ ప్రోగ్రాం కి కొంత గ్యాప్ ఇచ్చిన హైపర్ ఆది తాజాగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇటీవల హైపర్ ఆది పై కొంతమంది దారుణంగా చిత్తూరు జిల్లాలో దాడి చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే హైప‌ర్ ఆది మొద‌టి నుంచి ప‌వ‌న్‌కు వీరాభిమానిగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.
 
చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చాడు హైప‌ర్ ఆది. స‌భ‌లో ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకువచ్చారు. జై జగన్, జోహార్ వైఎస్ ఆర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసులు ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చిన‌ట్లు స‌మాచారం.
 
అయితే జ‌గ‌న్‌పై ఆది పంచ్‌లు వేయడంతోనే వైసీపీ కార్య‌క‌ర్తలు ఇలా దాడి చేశారని ప్ర‌త్య‌క్ష సాక్షులు అంటున్నారు. వైసీపీ కార్య‌క‌ర్తలు దాడి చేయ‌డంతో ఆది త‌న ప్ర‌సంగాన్ని మ‌ధ్య‌లోనే ఆపేసి అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ముఖ్యంగా హైపర్ ఆది తెలిసీ తెలియని విధంగా వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం తోనే ఈ ఘటన జరిగిందని పలువురు అక్కడున్న వారు అంటున్నారు. మరికొంత మంది ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కమెడియన్లు తీసుకువచ్చి ప్రజల కోసం పోరాటం చేసే వారిపై పంచులు వేస్తే లాగే ఉంటుందని అంటున్నారు.


Tags :


Top