ఏపీ లో లక్షల్లో బోగస్ ఓట్లు..?

By Xappie Desk, January 22, 2019 12:18 IST

ఏపీ లో లక్షల్లో బోగస్ ఓట్లు..?

ఓటర్ అనలిటిక్స్ అండ్ స్ట్రాటజీ బృందం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల అక్రమ ఓట్లు ఉన్నట్లు గుర్తించింది. ఒక ప్రత్యేకమైన సాప్ట్ వేర్ ద్వారా ఓటర్ల జాబితాలను అద్యయనం చేసి అనేక సంచలన విషయాలు బయటపెట్టింది . ఈ బృందం ప్రతినిధులు మాట్లాడుతూ... ఈ నెల 11న ప్రచురితమైన కొత్త ఓటర్ల జాబితాను పరిశీలిస్తే 175 నియోజకవర్గాల్లో 59,18,631 ఓటర్లు నమోదు అక్రమంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే రెండు నియోజకవర్గాల్లో నమోదైన ఓటర్లు 39.11 లక్షల మంది, రెండు తెలుగురాష్ట్రాల్లో ఓటు కలిగిన వారు 20.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు.
 
నకిలీ ఓటర్ల నమోదు వివిధ రకాలుగా ఉన్నదని, కొన్ని పునరావృతం అయితే మరికొన్ని డూప్లికేట్‌ అయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో తప్పులు దొర్లాయని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్నికల అధికారిని వాస్ట్‌ ప్రతినిధులు కలిసి అక్రమ ఓట్ల వివరాలతో రూపొందించిన నివేదిక ఇచ్చారు. దీంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలు అవాక్ అయ్యాయి.


Tags :


Top