మీడియా పై సీరియస్ అయిన కేటీఆర్..!

Written By Xappie Desk | Updated: January 22, 2019 12:23 IST
మీడియా పై సీరియస్ అయిన కేటీఆర్..!

ఇటీవల జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దానికనుగుణంగానే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడం జరిగింది. ముఖ్యంగా దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ బీజేపీయేతర కూటమి ఏర్పడాలని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు కేసీఆర్. ఇదిలా ఉండగా ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న చండీ యాగం గురించి జాతీయ మీడియా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని కావడం కోసం కేసీఆర్ యాగం చేస్తున్నారని ఓ ఆంగ్ల పత్రిక వార్త రాసింది. దీంతో వెంటనే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సదరు పత్రిక పై మండిపడ్డారు.
 
కొన్ని మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నాయని ఆయన ద్వజమెత్తారు. ఇటువంటి వార్తలను పబ్లిష్ చేయడాన్ని సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం, ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ మూడురోజులపాటు సహస్ర మహాచండీయాగం చేస్తున్నారంటూ ఓ ఇంగ్లిష్ మీడియా వార్తను ప్రచురించింది. కేసీఆర్ ప్రధాని కోసం యాగాలు చేయడంలేదని, ఇలాంటి వార్త లు నిరాధారం అని పేర్కొంటూ కేటీఆర్‌కు హర్షవర్దన్ అనేవ్యక్తి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. మీడియా సంస్థలు కామన్‌సెన్స్ లేకుండా వార్తలు ప్రచురిస్తున్నాయంటూ రీ ట్వీట్‌చేశారు.
Top