సోషల్ మీడియాలో కామెంట్లు చూసి నేనే ముఖ్యమంత్రి అంటున్న: కేఏ పాల్

Advertisement

by Xappie Desk | January 23, 2019 12:17 IST
Follow Xappie
సోషల్ మీడియాలో కామెంట్లు చూసి నేనే ముఖ్యమంత్రి అంటున్న: కేఏ పాల్

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మరొక పక్క పొత్తుల గురించి వ్యూహాలు పండుతున్న ఇటువంటి సమయంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ చేస్తున్న కామెంట్లు హడావిడి ఏపీ ప్రజలను ఎంతగానో కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఏ మాత్రం బెదురు లేకుండా రాబోయే రోజుల్లో తానే ముఖ్యమంత్రినని ఇటీవల ఏపీలో ఓ ప్రముఖ వార్తా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది.
 
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనతోపాటు కలిసి నడవాలని అప్పుడే జనసేన పార్టీకి సీట్లు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వైఎస్ జగన్ లకు డిపాజిట్లు కూడా రావని మొత్తం రాష్ట్రం మొత్తం తన హవా కొనసాగుతుందని ఫలితాలు వచ్చాక అందరూ ఆశ్చర్యపోతారని కేఏ పాల్ చాలా ధీమాగా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లలో తనపై జరుగుతున్న విషప్రచారాన్ని ట్రోలింగ్స్ గురించి ఇటీవల హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పాల్ తన ఇంటర్వ్యూల కింద కామెంట్లు చూస్తే నూటికి 90 మంది తనకే సపోర్ట్ చేస్తున్నారని స్పష్టమైందని, రేపటి సిఎం తానేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నన్ను ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.


Advertisement


Advertisement

Top