టిడిపి నుండి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే బాబు పై సంచలన కామెంట్స్..!

By Xappie Desk, January 23, 2019 12:21 IST

టిడిపి నుండి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే బాబు పై సంచలన కామెంట్స్..!

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో ఏపీ రాజకీయ ముఖచిత్రం క్షణక్షణానికి మారిపోతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీ లో వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ కి అధికార పార్టీ టిడిపి కి తల నొప్పులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజంపేట ఎమ్మెల్యే టిడిపి పార్టీకి చెందిన మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మేడా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు అని విలువలతో కూడిన రాజకీయం చేయడం ఒక్క వైఎస్ కుటుంబానికి చెందుతుందని అది జగన్ ఏపీ రాజకీయాల్లో చాలాసార్లు నిరూపించారని పేర్కొన్నారు.
 
ప్రస్తుతం చెడిపోయినటువంటి రాజకీయ వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వైయస్ జగన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని పేర్కొన్నారు. ఏపీ ప్రజల్లో కూడా జగనే ముఖ్యమంత్రి అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారని ఇంకా ఓట్లు వేయడమే ఆలస్యం అని మేడా తెలిపారు. రాజంపేట నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జున్ రెడ్డి వైఎస్సార్సీపీ లో చేరాలంటే ఎమ్మెల్యే సహా అధికార పదవులన్నింటికీ రాజీనామా చేయాలని వైఎస్‌ జగన్‌ సూచించారు... తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని చంద్రబాబు విలువలు దిగజార్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత ముఖ్యమని పునరుద్ఘాటించారు. దీంతో వైఎస్‌ జగన్‌ సూచనతో పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరానని మేడా తెలిపారు.


Tags :


Top