Advertisement

ఢిల్లీలో సంచలనం రేపుతున్న చంద్రబాబు- రాహుల్ భేటీ..!

by Xappie Desk | January 23, 2019 12:26 IST
ఢిల్లీలో సంచలనం రేపుతున్న చంద్రబాబు- రాహుల్ భేటీ..!

ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఇటీవల జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతూ కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమిలో చాలా యాక్టివ్గా ఉంటున్న చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీ తరువాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో ఏకాంతంగా దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. అయితే త్వరలో ఏపీలో ఎన్నికలు వస్తున్న క్రమంలో పొత్తుల గురించి వీరిద్దరు మాట్లాడుకున్నట్లు చర్చించుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఏపీలో ఇటీవల బిజెపి పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు వారానికి ఒకరు వస్తున్న నేపథ్యంలో వారి గురించి కూడా చర్చించుకున్నట్లు మరియు అదే విధంగా అమరావతిలో త్వరలో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా చేపట్టనున్న ర్యాలీ గురించి కూడా రాహుల్ గాంధీ తో చర్చించినట్లు సమాచారం.
 
ముఖ్యంగా మరికొద్ది నెలల్లో ఏపిలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలా వద్దా అనేది ఇంకా వీరిద్దరు డిసైడ్ కాలేదని సమాచారం. కారణం ఇటీవల తెలంగాణలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ పార్టీ టిడిపితో కలిసి పోటీ చేసిన కానీ ఏ మాత్రం తెలంగాణ ప్రజలను ప్రభావితం చేయని నేపథ్యంలో రాబోయే ఏపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా వద్దా అన్న విషయంలో డైలమాలో పడిపోయారు ఇద్దరు నేతలు. అంతేకాకుండా అమరావతిలో త్వరలో జరగబోయే ధర్మపోరాటం దీక్షకు స్పెషల్గా రాహుల్ గాంధీని ఈ సందర్భంగా ఆహ్వానించారట చంద్రబాబు. ఒకవేళ ఈ దీక్షకు రాహుల్గాంధీ గనుక వస్తే కచ్చితంగా 2019 ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నట్లు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద ఢిల్లీలో జరిగిన వీరిద్దరి పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించింది.


Advertisement


Advertisement


Top