ఏపీలో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ..!

Written By Xappie Desk | Updated: January 24, 2019 10:52 IST
ఏపీలో ఒంటరిగానే బరిలోకి దిగుతామంటున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ..!

2014 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఇదే క్రమంలో రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడానికి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపాజిట్లు రాకుండా దారుణంగా ఓడించారు ఆంధ్ర ప్రజలు. అయితే తాజాగా ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పొత్తుల విషయంపై ఏపి పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మాట్లాడుతు ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటి చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.
 
పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటిచేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ని ప్రధాని చేయడమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెస్‌కు మాత్రమే ఓటు వేయాలని వేరే ఎవరికి వేసిన నష్టమని రఘువీర్‌ అన్నారు. ఇది ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమని.. ఏపీ ఇంఛార్జి ఉమెన్ చాందీ ద్వారా తమకు తెలియజేశారని రఘువీరా తెలిపారు. టిడిపి తో అవగాహన జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు. ఈ నెల 31న అన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుకు ముడిపడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నిటినీ కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు రఘువీరారెడ్డి .
Top