టిడిపి నాయకుడికి దిమ్మతిరిగిపోయే వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

By Xappie Desk, January 24, 2019 11:09 IST

టిడిపి నాయకుడికి దిమ్మతిరిగిపోయే వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న అధికార పార్టీ టిడిపి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని ఇటీవల అనేక వార్తలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ 175 నియోజక వర్గ స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తుందని కేవలం వామపక్ష పార్టీల తప్ప వేరే ఇతర పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని అందరికీ క్లారిటీ ఇస్తున్న మరో పక్క టిడిపి పార్టీకి సంబంధించిన నాయకులు లేనిపోని ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు.
 
ఈ క్రమంలో ఇటీవల టిడిపి రాజ్యసభ సభ్యులు కర్నూలు ప్రాంతానికి చెందిన టీజీ వెంకటేష్ జనసేన పార్టీ తమతో సామరస్యంగానే ఉందని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో కలకలం సృష్టించాయి. దీంతో వెంటనే స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్టణం జిల్లా పాడేరులో జరిగిన బహిరంగ సభలో పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదంటూ పవన్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. పెద్దమనిషి అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. లేదంటే నేను నోరు అదుపు తప్పితే మీరు ఏమవుతారో తెలియదు.గగ అంటూ గర్జించారు. పారిశ్రామికవేత్తగా నదులు, పర్యావరణాన్ని టీజీ వెంకటేష్ కలుషితం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. తాను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటు తెచ్చుకున్న టీజీకి బుద్ధి చెబుతానని పవన్ వ్యాఖ్యానించారు.


Tags :


Top