జనసేన పార్టీతో పొత్తు గురించి ఇష్టానుసారం గా మాట్లాడిన టీజీ పై ఫైర్ అయిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: January 24, 2019 11:13 IST
జనసేన పార్టీతో పొత్తు గురించి ఇష్టానుసారం గా మాట్లాడిన టీజీ పై ఫైర్ అయిన చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఇటీవల జనసేన పార్టీతో పొత్తు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అటు జనసేన కార్యకర్తలు మరియు ఏపీ లో ఉన్న రాజకీయ నేతలు అందరూ షాక్ తిన్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎస్పి, బిఎస్పీతో కలిసినపుడు టిడిపి, జనసేనతో కలిస్తే తప్పేంటి అని వెంకటేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టిజి వెంకటేశ్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పాలసీలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని, ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని, పార్టీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు నేతలు సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు సూచించారు.
 
ఎన్నికల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికి మంచిది కాదని చంద్రబాబు హెచ్చరించారు. మరోపక్క ఎన్నికల కోసం ప్రతి నాయకుడి కష్టపడాలని కిందిస్థాయి కార్యకర్తల నుండి ప్రజలను కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని ఏదైనా మాట్లాడే ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేశారు చంద్రబాబు. అయితే మరో పక్క విపక్ష పార్టీలు మాత్రం ఇది టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ముందు ఇలానే ప్రకటనలు చేపించి అవసరం ఉన్నా నాయకులను పార్టీలను వాడుకోవటం టిడిపి నైజమని అంటున్నారు.
Top