చంద్రబాబు ఇస్తున్న హామీల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటిఆర్..!

Written By Xappie Desk | Updated: January 24, 2019 11:17 IST
చంద్రబాబు ఇస్తున్న హామీల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటిఆర్..!

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఏపీ లో ఉన్న రాజకీయ వాతావరణం గురించి మరియు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు సీఎం చంద్రబాబు గురించి టీడీపీకి మద్దతు గా ఉండే ఎల్లో మీడియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హామీలు పథకాలు ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎన్నికల ముందు చంద్రబాబు చూపించే ప్రేమ కి గతంలో లాగా ఏపీ ప్రజలు మోసపోరని పేర్కొన్నారు కేటీఆర్. ఏపీలో మరోమారు అధికారం చేజిక్కించుకునేందుకు రచించుకున్న వ్యూహం బోల్తా కొట్టడం ఖాయమని కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు.
 
చంద్రబాబు కుట్రలను అర్థం చేసుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు లేరని - తెలివైన నిర్ణయం తీసుకునే ఏపీ ఓటర్లు చంద్రబాబును ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు టైం దగ్గరపడిందని కూడా కేటీఆర్ చెప్పారు. ఆ తర్వాత ఎల్లో మీడియాపై తన దృష్టిని సారించిన కేటీఆర్... కొన్ని పత్రికలు - మీడియా సంస్థలు ద్వంద్వ ప్రమాణాలతో పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వార్తలంటే తమకు ఇష్టమేనని - అయితే ఏపీలో కూడా తెలంగాణ వార్తలను చూపాల్సిందే - రాయాల్సిందే కదా అని కూడా కేటీఆర్ లాజిక్ తీశారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.
Top