బెజవాడ రాజకీయాలలో అదిరిపోయిన జగన్ స్ట్రాటజీ..!

By Xappie Desk, January 25, 2019 14:17 IST

బెజవాడ రాజకీయాలలో అదిరిపోయిన జగన్ స్ట్రాటజీ..!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు కమ్ముకొస్తున్న క్రమంలో ఆంధ్ర రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి ముఖ్యంగా బెజవాడలో రాజకీయ వాతావరణం గమనిస్తే చాలా రసవత్తరంగా మారింది. గతంలో వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వంగవీటి రాధా తాజాగా తాను అధ్యక్షుడు జగన్ వైఖరి తనకు నచ్చలేదని ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి జగన్ పార్టీపై మరియు ఆ పార్టీలో ఉన్న కొందరు నేతల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ డౌన్ ఫాలో అవుతున్న సమయంలోనే జగన్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడా కూడా పార్టీకి డ్యామేజ్ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
ఈ క్రమంలో బెజవాడ రాజకీయాలు గమనిస్తే వంగవీటి రాధా వర్సెస్ దేవినేని కుటుంబాలు అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి దేవినేని అవినాష్ టిడిపిలో నుండి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు బెజవాడ రాజకీయాలలో వినబడుతున్న టాక్. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్... దేవినేని అవినాష్ ని పార్టీలోకి తీసుకుని రాబోయే ఎన్నికలలో బెజవాడ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేపించి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
 
మరోపక్క దేవినేని అవినాష్ కూడా తెలుగుదేశం పార్టీని వీడి బయటకు రావాలని తన అనుచరులతో కలిసి చర్చించి భవిష్యత్తు రాజకీయాల గురించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. మొత్తంమీద జగన్ ఎక్కడా కూడా పార్టీకి డ్యామేజ్ కాకుండా అదిరిపోయే స్ట్రాటజీలు వేసుకుంటూ పార్టీలో ఉన్న నాయకులు చెప్పినట్లు అధ్యక్షుడు వినేటట్టు కాకుండా అధ్యక్షుడు చేసిన పోరాటానికి తగ్గట్టు నాయకులు మెలిగే టట్లు వ్యవహరిస్తున్నారు జగన్ అని పేర్కొంటున్నారు రాజకీయవిశ్లేషకులు.


Tags :


Top