వంగవీటి రాధా గురించి జనసేన పార్టీ లో జరిగిన చర్చ ఏంటో తెలుసా..?

Written By Xappie Desk | Updated: January 25, 2019 14:23 IST
వంగవీటి రాధా గురించి జనసేన పార్టీ లో జరిగిన చర్చ ఏంటో తెలుసా..?

ఇటీవల వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చిన వంగవీటి రాధా తన తాజా భవిష్యత్తు రాజకీయాలు తనను తన కుటుంబాన్ని నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం చేయకుండా ఉంటాయని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అయితే వైసిపి పార్టీని వీడిన వంగవీటి రాధా ముందుగా జనసేన పార్టీలో చేరాలని అనుకున్నారట. ఇదే క్రమంలో రాధా అనుచరులు కూడా జనసేన పార్టీలో చేరితే బాగుంటుందని సూచించినట్లు సమాచారం.
 
అయితే ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు పార్టీ క్యాడర్ మాత్రం రాధా ని ఆహ్వానించడం పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదని అదే సమయంలో రాధా కూడా తనంతట తానూ కూడా ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో కూడా లేరని తెలిసింది. అందుమూలంగానే రాధా జనసేన పార్టీలోకి చేరేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. ఇదే క్రమంలో జనసేన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వంగవీటి రాధా అన్ని పార్టీలో చేర్చుకుంటే కచ్చితంగా పార్టీకి కుల ముద్ర పడుతుందని కేవలం ఒక కులానికి జనసేన పార్టీ కొమ్మ కాస్తున్నట్లు ప్రజలు గందరగోళానికి గురవుతారు అని ఇందుమూలంగా నే వంగవీటి రాధా ని పార్టీలో చేర్చుకోవడం లో పెద్దగా ఆసక్తి చూపించలేదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Top