రాబోయే ఎన్నికలలో రంగంలోకి దిగబోతున్నారు చిరంజీవి..?

Written By Xappie Desk | Updated: January 25, 2019 14:31 IST
రాబోయే ఎన్నికలలో రంగంలోకి దిగబోతున్నారు చిరంజీవి..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నారని ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో గత ఎన్నికలలో 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి కనీస డిపాజిట్లు లేకుండా దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గురించి అన్ని తానే వ్యవహరిస్తారని చిరంజీవి చూసుకుంటారు అని పేర్కొన్నారు. ప్రస్తుతం సినిమా రంగంలో బిజీ బిజీగా గడుపుతున్న చిరంజీవి ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ లాంటి బ్రోకర్ పార్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీ కి అవసరం లేదని ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా దమ్ముంటే ఏపీలో కెసిఆర్ తో కలిసి జగన్ పోటీ చేయాలని రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని రుఘువీరారెడ్డి స్పష్టం చేశారు. ప్రియాంక రాకతో మల్లి ఇందిరమ్మ వచ్చినట్లుగా అనిపిస్తుందని, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కునే దమ్ము ఎవరికి లేదని ఆయన అన్నారు.
Top