తాజాగా బయటపడిన జాతీయ సర్వే రిజల్ట్ చూసి బెదిరిపోతున్న టిడిపి పార్టీ నేతలు…!

Written By Xappie Desk | Updated: January 25, 2019 17:54 IST
తాజాగా బయటపడిన జాతీయ సర్వే రిజల్ట్ చూసి బెదిరిపోతున్న టిడిపి పార్టీ నేతలు…!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న అధికార పార్టీ టిడిపి రాబోయే ఎన్నికలకు అన్ని విధాల సిద్ధమవుతుంది. అయితే గత ఎన్నికలలో టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల విషయంలో చాలావరకు ప్రజలు సంతృప్తి చెందని నేపథ్యంలో మరియు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన హామీల విషయంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం తో గత నాలుగు సంవత్సరాలు చెట్టాపట్టాలేసుకుని తాజాగా ఎన్నికలు వస్తున్న క్రమంలో ఈ సంవత్సరం ముందు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం అంటూ చంద్రబాబు మీడియా ముందు మాట్లాడటం తో ఎవరు ఆయన్ని నమ్మే స్థితిలో లేరని మరొకసారి తేలిపోయింది.
 
ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల అయిన సీఎన్ఎక్స్ స‌ర్వే ఫ‌లితాలు వైసీపీకే ప‌ట్టం క‌ట్టింది. అయితే ఇప్పుడు మ‌రో జాతీయ స‌ర్వే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ప్ర‌ముఖ జాతీయ మీడియా సంస్థ అయిన రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే ఫ‌లితాల‌ను తాజాగా విడుద‌ల చేసింది. నేషనల్ అప్రూవల్ రేటింగ్స్ పేరుతో రిపబ్లిక్ టీవీ – సీఓటర్ సంస్థ చేసిన జాతీయ సర్వేలో ఏపీలో వైసీపీకి 19 పార్లమెంటు స్థానాలు, టీడీపీకి 6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే జనసేన పార్టీ ఒక్క పార్ల‌మెంట్ సీటు కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది.
 
ఇక వైసీపీకి 41.3 శాతం ఓట్లు టీడీపీకి 33.1 శాతం, కాంగ్రెస్‌కి 9.8 శాతం, బీజేపీకి 7.2 శాతం, ఇతరులకు 8.6 శాతం ఓట్లు వస్తాయని సీఓటర్ సర్వే స్పష్టం చేసింది. మ‌రి ఈ స‌ర్వేలో నిజ‌మెంత ఉందో తెలియ‌దు కానీ, సోష‌ల్ మీడియాలో మాత్ర వైర‌ల్ అవుతోంది. దీంతో మ‌రోసారి గెలిచి అధికారంలోకి రావ‌ల‌ని భావించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంచ‌నాలు తారుమారు అయ్యాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. దీంతో ఈ సర్వే రిజల్ట్ చూసిన టిడిపి నేతలకు ఓటమి భయం పట్టుకున్నట్లు సమాచారం.
Top