ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చూసి టీడీపీ నేతలకు క్లాస్ పీకిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: January 25, 2019 17:57 IST
ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చూసి టీడీపీ నేతలకు క్లాస్ పీకిన చంద్రబాబు..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో ముఖ్యంగా జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ కి అధికార పార్టీ టిడిపి నేత చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్న క్రమంలో మరోపక్క తెలుగుదేశం పార్టీ నుండి చాలా మంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎన్నికలకు వేస్తున్న వ్యూహాలు మొత్తం తారుమారవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఈ క్రమంలో 25 ఎంపిలు, 150 ఎమ్మెల్యేలు అన్న భ్రమలను టిడిపి నేతలకు కలిగించాలనుకున్న చంద్రబాబుకు సొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ షాక్ ఇచ్చాయి.
 
థంపింగ్ మెజార్టీతో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అన్న రిపోర్ట్స్ రావడంతో చంద్రబాబు టెన్స్ అయిపోతున్నాడు. గొప్పగా ఏం జరిగినా ఆ ఘనత నాది. తేడా వస్తే ఆ తప్పు టిడిపి నేతలది, ఎమ్మెల్యేలది అన్న తరహాలో ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ మొత్తం ఎమ్మెల్యేలపైకి నెట్టేస్తూ వరుసగా వాళ్ళకు క్లాసులు పీకుతున్నాడు. ఎమ్మెల్యేలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం ఖాయం... ఆ ఓటమికి కారణం మీరే అన్న రేంజ్‌లో చంద్రబాబు క్లాసులు పీకుతూ ఉండడంతో టిడిపి ఎమ్మెల్యేలు షాక్ అవుతున్నారు. రీసెంట్ టూ త్రీ డేస్‌లోనే దాదాపు 15 మంది ఎమ్మెల్యేలకు, ఆయా నియోజకవర్గ నాయకులకు ఇదే రేంజ్‌లో క్లాసులు పీకాడు బాబు. మొత్తం మీద చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎన్నికల రాకముందే ఓటమిని అంగీకరించినట్లు ఆ తప్పుని తన పార్టీ నేతలపై పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఉంది అని అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ నేతలు.
Top