2014 ఎన్నికలలో ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అని ప్రకటించిన చంద్రబాబు ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో గెలిచాక ఆ మాటనే మర్చిపోయారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో హడావిడిగా ఇటీవల ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తున్నట్లు చంద్రబాబు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజలకు సంచలన హామీలు మరియు ప్రకటనలు చేస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఇచ్చిన హామీ అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎపిలో కోటి నలభై లక్షల కుటుంబాలకు స్మార్ట్ పోన్ లు పంపిణీ చేస్తామని ఆయన చెబుతున్నారు. ముందుగా డ్వాక్రా మహిళలకు సెల్ పోన్ లు ఇస్తామని ఆయన అంటున్నారు. 40 రోజుల్లో ఫోన్ల పంపిణీ జరుగుతుంది. డ్వాక్రా మహిళలు కూడా పారిశ్రామికవేత్తలు కావాలి. 10 లక్షల సంఘాలు 10 లక్షల విజన్ డాక్యుమెంట్లు చేయాలి. మనం చేసే పనులు వినూత్నంగా ఉండాలన్నారు అని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల సమావేశంలో ఆయన ప్రసంగించారు. దీంతో చంద్రబాబు ప్రసంగం అన్న చాలా మంది ఏంటి ఈ హామీలు అని నోరెళ్ళ పెడుతున్నారు. రాష్ట్రానికి కావలసింది ప్రత్యేక హోదా మరియు పోలవరం వంటి ప్రాజెక్టు విషయాలలో చొరవ తీసుకొని నిస్వార్ధంగా చంద్రబాబు పని చేస్తే బాగుంటుంది కానీ ఇలా వ్యక్తిగతంగా ప్రజలకు వరాల జల్లుతూ ప్రజలను మభ్య పెట్టడం దారుణమని ఎన్నికల ముందు ఇలాంటి ప్రకటనలు విని మేము మోసపోము అని అంటున్నారు.