చంద్రబాబు కి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

Written By Xappie Desk | Updated: January 26, 2019 12:14 IST
చంద్రబాబు కి షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

గత నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని చంద్రబాబు ఇటీవల రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసిందని మీడియా ముందు గగ్గోలు పెడుతున్నారు చంద్రబాబు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను తమకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేకూరే విధంగా చంద్రబాబు వ్యవహరించడం మరియు ఇతర ఇతర విషయాలలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏపి ప్రజల ముందు దారుణంగా చిత్రీకరించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు చంద్రబాబు కి గట్టి గుణపాఠం తెలియజేస్తున్నట్లు ప్రస్తుత పరిస్థితుల బట్టి తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఎపిలో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రం పగ్గాలు వేస్తున్నట్లుగా ఉంది. తెలుగుదేశం మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది.ఎపి ప్రభుఈత్వం మరిన్ని అప్పులు చేయడానికి ప్రయత్నిస్తుంటే కేంద్రం కొర్రీలు వేస్తోందని ఆ వార్త సారాంశం. జనవరి-మార్చి వరకు రూ.12,000 కోట్లమేర మార్కెట్‌ నుంచి రుణాలు సమీకరించుకునే వీలు రాష్ట్రానికి ఉంది. అయితే, ఇప్పటి వరకు కేంద్రం రెండు విడతలుగా రూ.3,000 కోట్ల రుణాల సమీకరణకు మాత్రమే అనుమతులిచ్చింది. అంటే ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి , ఓటర్లకు ఏదో రూపంలో పంచాలన్న ప్లాన్ ను కేంద్రం అడ్డుకుంటోందని అనుకోవాలా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదిక సమర్పించాలని కేంద్రం కోరింది. దీనిపై రాష్ట్రం నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపింది. ఆ తర్వాత కూడా కేంద్రం అనుమతులు ఇవ్వలేదు.
 
దీనిపై రాష్ట్ర అధికారులు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రం సమర్పించిన వివరాలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తాలకు అనుమతులిస్తామని కేంద్రం వారికి సమాధానం ఇచ్చింది. కానీ, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. తమకు అంత కాలం వేచి చూసే అవకాశం లేదని రాష్ట్ర అధికారులు కేంద్రానికి వివరించారు. పీడీ ఖాతాల్లో నిధులున్నప్పటికీ, అప్పులు ఎందుకు చేస్తున్నారని కేంద్రం వారిని ప్రశ్నించింది.Top