టిడిపి మంత్రి పై ఎవరు ఊహించని విధంగా కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్..!

Written By Xappie Desk | Updated: January 26, 2019 12:21 IST
టిడిపి మంత్రి పై ఎవరు ఊహించని విధంగా కామెంట్లు చేసిన పవన్ కళ్యాణ్..!

ఏపీ విద్యాశాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురించి గత కొంతకాలం పార్టీ మారుతున్నారు అన్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో వినబడుతున్నాయి. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీ లోకి వెళ్తున్నట్లు ఎక్కువ వార్తలు వచ్చాయి. దీంతో ఇటీవల జరిగిన పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి గంటా పై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మంత్రి గంటాను జనసేనలోకి రమ్మని ఆహ్వానించబోమని ఆయన అన్నారు. అయితే తనకు ఆయనపై కోపం లేదని, ఆయన ఆలోచనలు జనసేనకు సరిపడవని పవన్ అన్నారు.
 
గంటా లాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి ఎగిరిపోతారు. అలాంటి పక్షులను నమ్మను అని కూడా వ్యాఖ్యానించారు.విశాఖ జిల్లా పార్టీ కార్యకర్తలతో ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించారు. రాజకీయాలను లోకేశ్‌, జగన్‌ వంటి వారు వారసత్వపు హక్కుగా భావిస్తారు. జనసేన మాత్రం సామాజిక బాధ్యతగా పరిగణిస్తుంది. 2019లో పదునైన వ్యూహంతో ఏపీ అసెంబ్లీలోకి జనసేన అడుగు పెడుతుంది. నీతిపరులు, అవినీతిపరులు అని విడదీసుకుంటూ పోతే రాజకీయాలు చేయలేం. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ఆ బురదలో దిగక తప్పదు. అందులో కమలంలా జనసేనను వికసింపజేస్తాం. వెన్నుపోటు పొడిపించుకునేంత బలహీనుడిని కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Top